రిపబ్లిక్ హిందుస్థాన్ :
ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా! లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది..
ఇండియన్ ఆర్మీలో కోటేశ్వర్ రావు విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం..
ఇది కూడా చదవండి…
రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం
నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ప్రవర్తించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు: సీపీ రామగుండం…
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీపీ గారు హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా చైనా మాంజ ఎక్కువగా విక్రయించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్.,(డిఐజి) గారు ఒక ప్రకటన లో తెలిపారు. చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, చైనా మాంజను ఉపయోగించే గాలి పటాలు ఎగురవేసే క్రమంలో ఎన్నో పక్షులు, సాధారణ ప్రజలు ప్రమాదానికి గురవుతారు. అదేక్రమంలో గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడ ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా మంజా నిషేదించం అని సీపీ గారు తెలిపారు. చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా వుంటుంది అని తెలిపారు.

Recent Comments