అమరావతి :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) మూడో జాబితా విడు దలైంది. ఇప్పటికే రెండు విడుతలుగా జాబితాలు విడుదల చేసిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM JAGANA MOHAN REDDY) .. తాజాగా 23 మంది ఇంఛార్జులతో మూడో జాబితాను గురువారం విడుదల చేశారు.
అయితే.. బుధవారమే ఈ మూడో జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. పలువురి విషయంలో స్పష్టత రాకపోవటంతో.. ఈరోజు పూర్తి క్లారిటీతో ఈ జాబితాను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టటమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే.. పలు కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి.. నియోజ కవర్గాల్లో బలమైన ఇంఛార్జులను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజక వర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా వైసీపీ ఇంఛార్జుల మూడో జాబితాను విడుదల చేశారు.
ఈ సారి 23 స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమిం చారు జగన్. మూడో జాబితాను బుధవారం జనవరి 10న రోజునే ప్రకటించాల్సి ఉండగా.. కొందరి విషయంలో స్పష్టత రాకపోవటంతో ఈరోజుకు వాయిదా పడింది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి బొత్స సత్యనారా యణ, ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి సుదీర్ఘంగా చర్చించి.. జాబితాను ఫైనల్ చేశారు.
ఈజాబితాలో 23 నియోజ కవర్గాలకు సంబంధించి కొత్త ఇంఛార్జులను ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోనూ పలువురికి ఇంఛార్జులుగా అవకాశం కల్పించారు
వైెఎస్ జగన్. అయితే.. ఇప్పుడు ప్రకటించే ఇంఛార్జులకే.. ఎన్నికల్లో అభ్యర్థులుగా ప్రకటించే అకాశం ఉండగా.. ఈ జాబితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా.. ఈ జాబితాల్లో కొందరు సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించగా.. కొన్ని స్థానాల్లో మాత్రం కొత్త ఇంఛార్జులను నియమించారు.
తిరువూరు- నల్లగట్ల స్వామి దాస్
సూళ్లూరుపేట- తిరుపతి ఎంపీ గురుమూర్తి
పెడన- ఉప్పాల రాము
చిత్తూరు- విజయానంద రెడ్డి
పెనమలూరు- జోగి రమేష్
పూతల పట్టు- డాక్టర్ సునీల్
రాయదుర్గం- మెట్టు గోవింద రెడ్డి
మార్కాపురం- జంకె వెంకట రెడ్డి
శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదన్
అనకాపల్లి- కిలారు పద్మ
ఆలూరు- విరూపాక్షి
దర్శి- శివప్రసాద్ రెడ్డి
మడకశిర- శభకుమార్
గూడురు- మెరిగ మురళి
గంగాధర నెల్లూరు- కృపాలక్ష్మి
పార్లమెంట్ పరిధిలో కొత్త ఇంఛార్జులు వీళ్లే..
విజయనగరం- చిన్న శ్రీను
విశాఖపట్నం- బొత్స ఝాన్సీ
అనకాపల్లి- అడారి రమాకుమారి
ఏలూరు- కారుమూరి సునీల్
YSR CONGRESS : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల
RELATED ARTICLES
Recent Comments