కరీంనగర్ జిల్లా , డిసెంబర్23 :
ఎల్లలు లేనిదే ప్రేమ. రెండు మనసలు ఒక్కటయ్యేం దుకు కులం, మతం, ప్రాంతం, భాష అనే బేధాలు ఉండవు. దేశాలు, ఖండాలు వేరైనా గతంలో ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటలు అనేకం.
తాజాగా.. తెలంగాణ అబ్బాయి, శ్రీలంక అల్లుడయ్యాడు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్‌కు చెందిన దాసం అరుణ్ కుమార్ తిమ్మాపూర్‌లోని జ్యోతిశ్మతి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు.
శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా కూడా ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది.అక్కడ 2014లో ఇద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు.
ఇలా వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి ఇద్దరు మనసులు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.తల్లిదండ్రులు విషయం చెప్పటంతో వారు కూడా అంగీకరించారు.
దీంతో అరుణ్ కుమార్‌ను పెళ్లి చేసుకునేందుకు అజ్జురా శ్రీలంక నుండి తల్లిదండ్రులతో అలుగునూర్ వచ్చారు. అరుణ్ కుమార్ పెళ్లి అజ్జురాతో పెద్దల సమక్షంలో శుక్రవారం రోజున రంగ రంగ పెళ్లిజరిగింది.వైభవంగా జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులు కొత్త జంటను ఆశీర్వదించారు.
భారత్ అబ్బాయి… శ్రీలంక అమ్మాయి…
ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
RELATED ARTICLES
Recent Comments