హైదరాబాద్:డిసెంబర్ 06
తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో రేవంత్ సమావేశం అవుతారు.
బుధవారం ఉదయం ఖర్గేతో భేటీ అవుతారు.. ఆ తరువాత రాహుల్, సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు.
సీఎంగా అవకాశం కల్పించినందుకు రేవంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదేవిధంగా 7న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానిస్తారు.
కాంగ్రెస్ పెద్దలతో భేటీలో కేబినెట్ కూర్పుపైనా రేవంత్ చర్చించనున్నారు…
నేడు కాంగ్రెస్ అధిష్టాన నేతలను కలవనున్న రేవంత్ రెడ్డి
Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES


Recent Comments