మంచిర్యాల జూలై 12 (రిపబ్లిక్ హిందుస్థాన్)
మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఇటిక్యాల గ్రామానికి చెందిన చిలుక దేవయ్య అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పక్క బెడ్ లో చికిత్స పొందుతున్న సుధాకర్ కత్తితో దేవయ్య ను పొడిచాడు. మెరుగైన చికిత్స కోసం దేవయ్యను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.దేవయ్య చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Recent Comments