Saturday, August 30, 2025

64 లక్షల కుటుంబాలకు చేరువైన “జగనన్నే మా భవిష్యత్తు”

▪️సీఎం జగనన్న పాలనకు మద్ధతుగా 49 లక్షల మిస్డ్ కాల్స్.. మెగా సర్వే వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వెల్లడించిన మంత్రులు

Thank you for reading this post, don't forget to subscribe!

▪️నిబద్ధత కలిగిన నేతకు.. అసత్య ప్రచారాలకు మధ్య యుద్ధం ఇది : మంత్రి  జోగి రమేష్

▪️రాష్ట్రానికి పట్టిన నిజమైన క్యాన్సర్ చంద్రబాబే.. : మంత్రి ఆర్కే రోజా

రిపబ్లిక్ హిందుస్థాన్, తాడేపల్లి : ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన సీఎం జగనన్న పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్ధతు పలికారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ సిపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వేకు రాష్ర్ట వ్యాప్తంగా విశేష మద్ధతు వస్తోంది. గ్రామాలు మొదలు పట్టణాల వరకు మా నమ్మకం నువ్వే జగన్ నినాదం మారుమొగుతోంది. జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వేలో భాగంగా ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ 64 లక్షల కుటుంబాలు చేరుకున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా 49 లక్షల కుటుంబాలు సీఎం జగనన్న పాలనకు మద్దతు పలికాయని నాయకులు పేర్కొన్నారు. 

దేశ రాజకీయ చరిత్రలో వైఎస్సార్ సీపీ జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే పేరుతో చరిత్ర సృష్టించిందని, ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకు చేర్చిన సీఎం జగన్ లాంటి సాహసోపేత నిర్ణయం ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు. ఈ మెగా సర్వేలో 7 లక్షల మంది పార్టీ సైనికులతో వైఎస్సార్ సీపీ ఇప్పటి వరకు 64 లక్షల కుంటుంబాలకు చేరువ కాగా 49 లక్షల కుంటుంబాలు సీఎం జగనన్న పాలనకు మద్దతు పలికాయని వివరించారు. వైఎస్సార్ సీపీ ఏప్రిల్ 7వ తేదీన జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిందని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జోగి రమేశ్, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు. జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే రాష్ట్ర ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగనన్న ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారని మంత్రి జోగి రమేశ్ వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వే కార్యక్రమం వారం రోజుల్లోపే విశేష ప్రజాదరణను సొంతం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో వైఎస్సార్ సీపీ క్యాడర్ రెట్టింపు ఉత్సాహంతో మా నమ్మకం నువ్వే జగన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని కొనియాడారు. 

*సీఎం జగనన్నే మాటే రాష్ట్ర ప్రజల భరోసా.. మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌*

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఇప్పటికే 98 శాతానికి పైగా నెరవేర్చిన సీఎం జగన్ పాలనపై ప్రజలు పూర్తి స్థాయి సంత`ప్తిగా ఉన్నారని మంత్రి ఆదిమూలపు సరేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పక చేస్తారనే నమ్మకం ప్రజలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి భారీ స్థాయిలో మద్ధతు పలికేలా చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మెగా పీపుల్ సర్వే దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ నిర్వహించలేదన్నారు. తమ ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాల్ని సేకరించే సాహసోపేతమైన కార్యక్రమం ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగనన్నే మా భవిష్యత్తు సర్వేలో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనమని వివరించారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గినా ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు చేశారని పేర్కొన్నారు. ఏపీ ఇతర రాష్ర్టాలతో పోలిస్తే అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని దీనికి రాష్ట్ర తలసరి ఆదాయ పెరుగుదలే నిదర్శనమని వివరించారు. 2022–23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం రూ.2,19,518 ఉండగా 2021–22 ఏడాదితో పోల్చితే రూ.23,476కు పెరిగిందన్నారు. 2021–22లో రూ. 1.92 లక్షలు ఉన్న తలసరి ఆదాయం 2022–23లో రూ.2.19 ల‌క్ష‌లకు పెరిగిందన్నారు. దేశ తలసరి ఆదాయం 1.72 లక్షలతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.47.518 కోట్లుగా ఉందన్నారు. అంతేకాకుండా జీఎస్‌డీపీ వృద్ధిలో దేశంలోనే రాష్ర్టం ప్రథమ స్థానంలో నిలిచిందని, సీఎం జగన్ దార్శనికతతో రాష్ట్రం 11.43 శాతం గ్రోత్‌ రేట్‌ సాధించిందని మంత్రి వివిరంచారు. దీనికి కారణం సీఎం జగన్‌ సుమర్థ పాలన అవినీతి లేని పారదర్శకత, జవాబుదారీ తనంతో కూడిన పరిపాలనేనని మంత్రి జోగి రమేశ్ వివరించారు.

*వివక్ష లేని సంక్షేమంతో మెరుగైన పాలన.. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ*

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివక్ష లేని సంక్షేమంతో రాష్ర్ట ప్రజలకు మెరుగైన పాలన అందుతోందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటర రమణ తెలిపారు. సీఎం జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయ పార్టీలను చూడటం లేదన్నారు. జగనన్నే  మా భవిష్యత్తు కార్యక్రమంలో మలిదశలో ప్రతిపక్షపార్టీలకు మద్దతుగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వారి ఇళ్ల వద్దకే వెళ్లి వివరిస్తామన్నారు. 98 శాతం మెనిఫెస్టో అమలు చేసి సీఎం జగన్ సంక్షేమ సారథిగా నిలిచాలరని ఎంపీ కొనియాడారు. “మా నమ్మకం నువ్వే జగన్” అనే నినాదానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా వచ్చే 7 రోజులు మెగా పీపుల్ సర్వే నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా సరికొత్త సుపరిపాలనకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చారన్నా హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలను గతంలో అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయని కానీ సీఎం జగన్‌ సుపరిపాలనలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవిస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా పది రూపాయలు ఇస్తే ఆరు రూపాయలు మధ్యవర్తులకు, దళారులకు పోగా లబ్ధిదారుడికి కేవలం నాలుగు రూపాయలే దక్కేదని ఎంపీ వివర్శించారు. కానీ నేడు ఎలాంటి అవినీతి లేకుండా లబ్ధిదారుడికి సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నారని వివరించారు. సీఎం జగన్‌ పాలనలో అమలవుతున్న పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని ప్రజలు పీపుల్స్‌ సర్వే కోరుతున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

*చంద్రబాబే రాష్ట్రానికి పట్టిన నిజమైన క్యాన్సర్.. మంత్రి ఆర్కే రోజా*

రాష్ట్రానికి పట్టిన నిజమైన క్యాన్సర్ చంద్రబాబేనని పర్యాటక మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పేదలకు మంచి జరగ కూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు టిడ్కో ఇళ్లు తదితరాలపై చేసిన సెల్ఫీ ఛాలెంజ్‌ నిజం కాదని.. నిజానికి చంద్రబాబు సెల్ఫ్ గోల్ అని పేర్కొన్నారు. సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో చంద్రబాబు ఫేక్ పొలికల్ డ్రామాలకు తెరతీశారని మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో మంచి చేసిన ఒక్క పేద వాడి ఇంటి దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని మ్యానిఫెస్టోలో ఏం చెప్పావో, అధికారంలో ఏం చేశావో చర్చించేందుకు సిద్ధమా.. దమ్ముంటే మేనిఫెస్టే అమలుపై చర్చకు రా’ అని రోజా సవాల్‌ విసిరారు. ‘ప్రజల ఇంటి వద్దే వాలంటీర్లు వెళ్లి సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. గెలిచిన తరువాత కూడా రాష్ర్టంలో ప్రతి ఇంటికి  ఎమ్మెల్యేలు, మంత్రులు వెళుతున్నారని ఇదంతా సీఎం జగన్ పారదర్శక పాలన వల్లే సాధ్యపడిందన్నారు. వలంటీర్ వ్యవస్థ ఒక సైనిక వ్యవస్థలాగా ఏపీ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. అందుకే ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్ అని నినదిస్తున్నారని ఇంట్లో ఎవరూ చూడకపోయినా సీఎం జగననన్న ఉన్నారనే నమ్మకంతో చాలామంది ఉన్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పి పేదల ఇంటికి స్టిక్కర్లు వేయాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏం మంచి చేస్తోందో టీడీపీ, జనసేన నేతలు ప్రజల్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి