రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్, ఏప్రిల్ 11 : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడిలో దారుణ హత్య జరిగింది. ఎస్సై బి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన వ్యాపారి నడిపెళ్లి లక్ష్మికాంతారావు(60) అనే వ్యక్తిని పలువురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలిపారు. 2019 లో కూనారపు మల్లేష్ క్యాతనపల్లి శివారులో ప్లాట్ ను మృతునికి అమ్మాడు. ఇదే ప్లాట్ ని కూనారపు మల్లేష్ వేరే వ్యక్తులకు అమ్మాడు. ఈ విషయంలో కూనారపు మల్లేష్ కు మృతునికి మద్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. మామిడి శ్రీనివాస్ అనే వ్యక్తి నడిపెళ్లి లక్ష్మికాంతారావు కి అప్పుడప్పుడు డ్రైవర్ గా పనిచేసే వాడని మంగళవారం రోజు నడిపెళ్లి లక్ష్మి కాంతారావు ఇంటికి వచ్చి, మృతుడు ఎక్కడ ఉన్నాడు అని అడగగా, క్యాతనపల్లి లోని ప్లాట్ వద్దకి వెళ్లాడు అని చెప్పారు. ఆ తర్వాతనే మృతుడిపై దాడి జరిగిందని తెలిపారు. భూ వివాదం విషయంలో కూనారపు మల్లేష్,ఇంకా కొంత మంది హత్య చేసి ఉంటారని, మామిడి శ్రీనివాస్ పైన అనుమానాలు ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని డిసిపి కేకన్ సుధీర్ రామ్నాథ్, ఏసిపి తిరుపతి రెడ్డి, సిఐ మహేందర్ రెడ్డి పరిశీలించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments