Friday, November 22, 2024

కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి …కూతురి పై తండ్రి అత్యాచారం

బీహార్ , ముజఫర్‌పూర్‌: కామంతో కళ్ళుమూసుకపోయిన మనిషి రూపంలో ఉన్న పశువులు వావివరసలు మరిచిపోయి సభ్యసమాజం అసహించుకునేల ప్రవర్తిస్తున్నారు.
బీహార్ రాష్ట్రంలో ని ముజఫర్‌పూర్‌ కూతురికి శీతల పానీయం తాగించి తండ్రి అత్యాచారం చేసేవాడని బాధితురాలి తల్లి  చెప్పింది . నేను ఆపినట్లయితే, నన్ను , నా కూతురిని  కొట్టేవాడిని తెలిపింది.
ముజఫర్‌పూర్‌లో ఓ తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ముందుగా ఆమెకు శీతల పానీయంలో మత్తు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకునేలా చేసేవాడు.  ఆపై అత్యాచారం చేసేవాడు.  దీన్ని తల్లి వ్యతిరేకించడంతో ఆమెను తీవ్రంగా కొట్టేవాడు.

అయితే సదరు మహిళ భర్త మరణం తర్వాత బావమరిదితో వివాహం చేసుకుంది.

బాధితురాలి తల్లి తన భర్త 10 సంవత్సరాల క్రితం చనిపోయాడని ,  ఆయనకు ఇద్దరు కూతుళ్లు.  ఒకరికి వివాహమైంది.  మరొకరు ఇంకా మైనర్ అని తెలిపింది.  భర్త చనిపోవడంతో ఒక తోడు కావాలని బావమరిదితో పెళ్లి జరిపించారు.

రెండో భర్త తన కూతురికి తరచూ రాత్రిపూట శీతల పానీయాలు ఇచ్చేవాడు.  దీని తర్వాత ఆమె మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిద్రలేచేది.  ఆమె ఒంటి పై బట్టలు కూడా తెరిచి ఉండేవి.  కూతురి గదిలో ఎందుకు వెళ్లారు అని అడిగీతే, ఆమె సరిగ్గా నిద్రపోతోందో లేదో చూడడానికి వెళతాను అని చెప్పేవాడని తెలిపింది.

రెండో భర్త అతను ట్రక్కు డ్రైవర్.  బయటి నుంచి ట్రక్కు నడుపుతూ వచ్చినప్పుడల్లా శీతల పానీయాలు తెచ్చుకునేవాడు.  కూతురికి రాత్రి తాగేందుకు శీతల పానీయం ఇచ్చే వాడు .  కుమార్తె నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడేవాడు.  శీతల పానీయాలు తాగినప్పుడల్లా మరుసటి రోజు మధ్యాహ్నానికి నిద్ర లేచేది. అయితే అతను  నిందితుడు ఇంట్లో లేని రోజుల్లో ఆమె తెల్లవారుజామున నిద్రలేస్తుండడాన్ని తల్లి గమనించింది.
దీని గురించి ఆమె కుమార్తెతో మాట్లాడినప్పుడు, ఆమె కథ మొత్తం చెప్పింది.  తండ్రి శీతల పానీయం ఇస్తున్నాడని కూతురు ఆమెకు చెప్పింది.  దీని తర్వాత నాకు స్పృహ ఉండడం లేదని తెలిపింది.  ఉదయం నా బట్టలు తెరిచి ఉన్నాయి అది బాధగా ఉంటుంది అని తెలిపింది.

నిందితుడి పై కేసు నమోదు చేసినట్లు ఓపీ ఇన్‌ఛార్జ్ హరేరామ్ పాశ్వాన్ తెలిపారు.  విచారణ అనంతరం నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.  బాలికకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి