— జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : త్వరలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మెడికల్ పారామెడికల్ సిబ్బందితోపాటు ఆశా కార్యకర్తలు అందరికీ విడుదలవారీగా వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు మన ఆరోగ్యం బాగుంటేనే మనం పది మందికి సేవ చేయగలమని తెలిపారు. దృష్టిలో ఉంచుకొని త్వరలో మెడికల్ పారామెడికల్ సిబ్బందితోపాటు ఆశా కార్యకర్తలు అందరికీ విడతల వారీగా వైద్య పరీక్షలు టీ హబ్ ద్వారా చేయడంతో పాటు చికిత్సలు కూడా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పదిమంది ఆరోగ్యం కాపాడే మనం మనం ఆరోగ్యంగా ఉంటేనే వారి ఆరోగ్యాన్ని కాపాడగలుగుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం టి హబ్ ఆసుపత్రిలో ప్రసూతి మాత శిశు సంరక్షణ గర్భిణీలకు పౌష్టికార పంపిణీ తో పాటు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు మహిళా ఆరోగ్యం పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆదిలాబాద్ జిల్లాలో హమాలివాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారని చివరకు క్యాన్సర్ వచ్చిన చెప్పుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు హమాలివాడలో ఏర్పాటుచేసిన మహిళ ఆరోగ్య క్లినిక్ ఆశా కార్యకర్తలు అందరూ వారం వారం కొంతమంది మహిళలను తీసుకువెళ్లి టెస్టులు చేయించవలసిన బాధ్యత మీపై ఉందన్నారు. క్యాన్సర్ ఇతర రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి మొదటి దశలో మహిళా క్లినిక్ లో గుర్తించినట్లయితే చికిత్స సుమాయసంగా ఉంటుందని తెలిపారు. క్యాన్సర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు మన ఆదిలాబాద్ లోనే త్వరలో జరుగుతాయని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి కాపాడడంలో ప్రతి ఒక్కరు సైనికుల పని చేయాలని తెలిపారు. ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారానే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ బి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన, జిల్లా ఎమునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్, డిప్యూటీ డి ఎం ఎం మరియు ఎయిడ్స్ లెప్రసీ టిబి జిల్లా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీకాంత్, పి ఓ డి టి టి డాక్టర్ మనోహర్, జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి డాక్టర్ విజయసారథి, ఎస్ ఓ బ్రహ్మానందం రెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి , జితేష్, రఘురాం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments