రిపబ్లిక్ హిందుస్థాన్,బజార్ హత్నూర్ : మంగళవారం రోజు మండలంలోనే మరిచిపోలేని రోజు ఎన్నో ఏండ్ల కళగా మిగిలిన బజార్ హత్నూర్ ఆర్ & బి. రోడ్డు నుంచి ఆశ్రమ మోడల్ స్కూల్ మీదుగా కొత్త పల్లి గ్రామానికి రోడ్డు కొరకు మంగళవారం రోజు ప్రభుత్వం నుంచి బీటీ రోడ్డు మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు మంగళవారం రోజు నిధులు మంజూరు చేయించడం శుభసూచకమని కొత్త పల్లి గ్రామస్తులు మరియు విద్యార్థులు అన్నారు. ఈ సందర్భంగా తమ కష్టాలను దృష్టిలో పెట్టుకొని బిటి రోడ్డు మంజూరు చేసినందుకు బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు చిత్రపటానికి మండల బి ఆర్ ఎస్ కార్యకర్తలు మోడల్ స్కూల్ విద్యార్థినులు చేత పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజారాం, యూత్ అధ్యక్షులు డా. శేఖర్, వర్తమన్నూర్ సర్పంచ్ లక్ష్మణ్, జాతర్ల ఉప సర్పంచ్ ప్రకాష్, మోడల్ స్కూల్ చైర్మన్ జాంసింగ్, యూత్ సభ్యులు ప్రభాకర్, చందు, సాయి తారక్ గార్లతో పాటు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మోడల్ స్కూల్ విద్యార్థినులు..
Thank you for reading this post, don't forget to subscribe!
Previous article
- Advertisment -


Recent Comments