Tuesday, October 14, 2025

UGADI : సౌదీలో  ఘనంగా ఉగాది వేడుకలు

రిపబ్లిక్ హిందుస్థాన్, సౌదీ అరేబియా : దేశంలో ఏదొక పేరుతో సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేస్తున్న రోజుల్లో ఎక్కడో బయట దేశానికి వెళ్లిన వారు తమ మాతృభూమికి దూరంగా ఎడారి దేశాలలో పని చేస్తున్న ప్రవాసాంధ్రులు వీలయినప్పుడల్లా విదేశీ గడ్డపై తమ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో తెలుగు పండుగలను అందరు కలిసి వైభవంగా జరుపుకుంటారు. శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది వేడుకలను సౌదీ అరేబియాలో క్యాపిటల్ పట్టణం రియాద్ లో తెలుగు ప్రవాసీయులు సాటా అధ్వర్యంలో ఇటీవల అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరింపజేశాయి. అందరూ ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. 

Thank you for reading this post, don't forget to subscribe!

రియాద్ లో స్ధానికంగా సాగయ్యె అరటి చెట్ల తోరణాలపై వడ్డీంచిన భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా ప్రవాసాంధ్రుడు సెంట్రల్ రీజియన్ ప్రెసిడెంట్ ఆనందరాజు  (+966 58 154 1366), ఊమెన్ ప్రెసిడెంట్ సుచరిత గార్లు (+966 55 576 8321) ఈ కార్యక్రమ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, మహిళలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రధానంగా తెలుగు మాషాలను మరియు వాటి ప్రాధాన్యతను ఆహ్లాద కరంగా వివరించడం చాలా సంతోసించాము. ఈ కార్యక్రమంలో మన సంస్కృతి సాంప్రదాయ పద్దతిలో భోజనాలు మన స్వస్థలం గుర్తుకొచ్చే విధంగా ఉన్నాయి అని అందరు అనడం చాలా గర్వించదగిన విశేషం. ప్రవాసంలో తెలుగు భాష,  సంస్కృతి పరిరక్షణకు పాటుపడడమే కాకుండా ఇక్కడ పుట్టి పెరుగుతున్న చిన్నారులకు కూడా వాటి విలువలను నెర్పిస్తున్నట్లుగా సాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మల్లేశన్ పెర్కోన్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక తెలుగు భాష శిక్షణ తరగతులను కూడ నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉగాది పచ్చడి ప్రత్యేకంగా చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆనంద్ పోకురీ, వంశీ, పవన్, రంజిత్, ముజ్జమిల్, సూర్య, ఏర్రన్న, జాని, సత్తి బాబు, మహేంద్ర, భారతి దాసరి, గీత, శ్వేతా, అనుషా, లక్ష్మీ కాకుమాని , పావని, లక్ష్మీ మాధవి, భారతి వి , శ్రీదేవి, అనూష , రమ్య మరియు టీమ్ పాల్గొని తమవంతు కృషి చేయడంతో పండుగ కు వచ్చిన అతిథులందరూ కార్యక్రమ నిర్వాహకులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉగాది పండుగ తో పాటూ హోలీ సంబరాలు జరపడం తో అతిథులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో ఈద్ మిలాప్ ను నిర్వహిస్తామని సాటా నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!