◾️వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ ఆరోపణ ◾️తాసిల్దార్ కార్యాలయంలో నే పురుగుల మందు తాగే ప్రయత్నం ◾️మందు డబ్బా తీసుకునే ప్రయత్నంలో ఎస్ఐ కంట్లో పడిన పురుగుల మందు
బాధిత మహిళ రైతును పురుగుల మందు తాగుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ఏఎస్ఐ రాజేశ్వరి కంట్లో పురుగుల మందు పడింది దీంతో ఆమెను నర్సంపేట లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు.
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని వారం అవుతున్న కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారంటూ మహిళా రైతు గురువారం పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రామతీర్థం శివారు బిల్లా నాయక్ తండ కు చెందిన మాలోతు పద్మకు ముచ్చుపుల శివారు సర్వేనెంబర్ 157/b లో 35 గుంటల భూమి ఉంది. అందులోనుండి 15 గంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయుటకు మార్చి 18న స్లాట్ బుక్ చేసుకున్నారు. మరుసటి రోజు నుండి కార్యానికి వచ్చి తాసిల్దార్ ను రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరడంతో సరైన పత్రాలు లేవంటూ ఒకరోజు, బ్యాంకు నుండి నో డ్యూ తేవాలంటూ ఒకరోజు ,అప్పిడవిట్ తీసుకురావాలని మరో రోజు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని బాధిత మహిళ ఆరోపించారు. గురువారం తాసిల్దార్ అడిగిన అన్ని పత్రాలను తీసుకువచ్చినప్పటికీ మరో రోజు రావాలని చెప్పడంతో అప్పటికే వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను ఓపెన్ చేసి తాగే ప్రయత్నం చేశారు. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎ ఎస్ఐ రాజేశ్వరి సంఘటన స్థలానికి చేరుకున్నారు.రైతు పద్మ చేతిలో నుండి పురుగుల మందు డబ్బాను బలవంతంగా లాక్కునే ప్రయత్నంలో ఎస్ఐ రాజేశ్వరి కళ్ళలో కురువమందు పడింది. వెంటనే ఆమెను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తాసిల్దార్ దూలం మంజుల వివరణ
రామతీర్థం శివారు బిల్లా నాయక్ తండ గ్రామానికి చెందిన మాలోతు పద్మ కుటుంబ సభ్యులు గతంలో వచ్చి గొడవ చేసిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గురువారం పద్మ వచ్చి ఇదే విషయాన్ని అడగగా ముఖ్యమంత్రి పర్యటనలో కలెక్టర్ ఉన్నారని రేపు కలెక్టర్ ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేస్తానని తెలిపినప్పటికీ వినకుండా గొడవ చేసి ఆత్మహత్యయత్నం చేశారని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments