రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (మార్చ్ 14) : 2022-2023 విద్యా సంవత్సరానికి గాను 15 మార్చి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ-ఫైనల్ పరీక్షలు మరియు విద్యాసంస్థలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ప్రకటించింది అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు 2022-2023 విద్యా సంవత్సరం పూర్తి కాకముందే రాబోయే 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ముందస్తు అడ్మిషన్స్ మొదలుపెట్టారు. గురువులను ఈ ఎండలో ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్స్ తీసుకురావాలనీ,అడ్మిషన్స్ తీసుకువస్తేనే శాలరీ ఇంక్రిమెంట్స్ చేస్తామని లేదంటే విధుల్లోంచి తొలగిస్తాం అని యజమాన్యాలు గురువులను వేధిస్తున్నారని గురుదక్షిణ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది పద్మ మండిపడ్డారు. ఇంత ఎండలో తిరిగితే గురువులు అనారోగ్యాలపాలు అవుతున్నారని,ఇప్పటికే కొత్త వైరస్ లతో ఎంతో అవస్థలుపడుతున్నారు. మహిళా గురువులు ఇంట్లో పనులు చక్కబెట్టుకుని స్కూల్ కి వస్తున్నారని వారి ఫ్యామిలీని చూసుకునే బాధ్యత ఎంతో ఉందని అడ్మిషన్స్ పేరిట హాస్పిటల్ పాలైతే వారికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు. క్లాస్ రూంలో పాఠాలు చెప్పడం మాత్రమే గురువుల బాధ్యత అలా కాకుండా సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ లాగా ఇంటింటికి తిరగడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. ప్రతి సంవత్సరం శాలరీ ఇంక్రిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయని శాలరీ ఇంక్రిమెంట్స్ కోసమే అడ్మిషన్స్ చేయాలి అని అన్యాయంగా గురువులను వేదిస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు వారికి నచ్చిన స్కూల్ లో వారి పిల్లలను అడ్మిషన్స్ చేసే నైతిక స్వేచ్ఛ వారికీ ఉంటుందని అలా కాకుండా వారి స్వేచ్చకు భంగం కలిగిస్తూ మభ్యపెట్టి ఇటు తల్లిదండ్రులను యాజమాన్యాలు ఆర్థిక దోపిడికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గురువులు ఎవరు అడ్మిషన్స్ కోసం రోడ్ల మీద తిరగకూడదని మీ బాధ్యత స్కూల్ క్యాంపస్ వరకు మాత్రమే ఉంటుందని,పిల్లలతో పాటు టీచర్లకు 8గం.ల నుండి 12.30గం.ల వరకు పనివేళలు దాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలనీ యజమాన్యాల నుండి ఏ విధమైన వేధింపులు ఎదురైనా మహిళలు తనకు సమాచారం అందిస్తే గురుదక్షిణ అధ్యక్షులు విజయకుమార్ నారమళ్ళ తో కలిసి న్యాయం కోసం పోరాడుతామని గురుదక్షిణ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది పద్మ తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments