◾️ ఉమెన్ సేఫ్టీ, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమంలో ఎస్సై బొరగాల అశోక్
రామకృష్ణాపూర్ మార్చ్ 13 (రిపబ్లిక్ హిందుస్థాన్) : రామకృష్ణాపూర్ లోని తవక్కల్ పాఠశాలలో లో తవక్కల్,అల్ఫోన్సా పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు సైబర్ నేరాలపై,ఉమెన్ సేఫ్టీ,ట్రాఫిక్ రూల్స్ పై రామకృష్ణాపూర్ ఎస్సై బొరగాల అశోక్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు,వేధింపులు ఉమెన్ సేఫ్టీ,షీ టీమ్స్ ప్రాముఖ్యత గురించి తెలిపారు.తాత్కాలిక ఆనందాల కోసం ప్రలోభాలకు,ఆకర్షణలకు గురై జీవితం నాశనం చేసుకోవద్దని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలు అలవర్చుకొని పట్టుదలతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలని,చదువు వలనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని, పెద్దలను,తల్లితండ్రులను గౌరవించడం అలవర్చుకోవాలని తెలిపారు.అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు.ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ట్రాఫిక్ రూల్స్,రోడ్ సేఫ్టీ లపై అవగాహనా ఉండాలని,హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని విద్యార్థులు తమ తల్లితండ్రులకు తెలియజేయలని,రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు,300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.



Recent Comments