రామకృష్ణాపూర్ ,మార్చ్ 8 (రిపబ్లిక్ హిందుస్థాన్) : భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సర్కల పద్మ వారి కుమారులు ఇద్దరు దేశ రక్షణ కొరకై బాడర్ సైనికులుగా గత కొన్ని సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా సర్కల పద్మ కి బిజెపి మహిళా మోర్చా చేతుల మీదుగా శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మ ఇద్దరి కుమారులను దేశ రక్షణ కోసం ఆర్మీలో పనిచేస్తున్నారని ఇటువంటి మాతృమూర్తికి మహిళ దినోత్సవం సందర్భంగా సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి భద్రత లేదని ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగినాయని బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఇప్పటికైనా మహిళా శక్తిని గుర్తించి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ఉపాద్యక్షులు జంగపెల్లి మల్లయ్య,వైద్య శ్రీనివాస్,బిజెపి పట్టణ మహిళ మోర్చా అధ్యక్షురాలు మేదరి లక్ష్మి,బెజ్జంకి కవిత,వైద్య ధనలక్ష్మి,రాజక్క,స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments