గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి మధు నాయక్ డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :
బుదవారం వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్యలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి కి జరిగిన సంఘటన మీద నిజనిర్ధారణ కమిటీ వేయాలని, దానికి కారణమైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి మధు నాయక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గురువారం పాలకవీడు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నిన్న రాత్రికి రాత్రి వరంగల్ నుండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి తరలించిన కారణాలు ఏందో తెలపాలని అదేవిధంగా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గిరిజన శాఖ మంత్రి ఇప్పటివరకు స్పందించకుండా వారి కుటుంబ సభ్యులను పరామర్శించకుండా ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు. ఆమె యొక్క హెల్త్ బులిటన్ ను ప్రతి గంటకు ఒకసారి విడుదల చేసి, ఆమె ప్రాణాన్ని రక్షించడానికి అన్ని రకమైన చర్యలు తీసుకోవాలని, ఆడబిడ్డను వారి కుటుంబానికి సురక్షితంగా అందించాలని మధు నాయక్ డిమాండ్ చేశారు. బాధితురాలికి ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఉన్న గిరిజన బంజారా ప్రజల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదనీ హెచ్చరించారు.


Recent Comments