*లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం
*పరారీలో లారీ డ్రైవర్
రిపబ్లిక్ హిందుస్తాన్ నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నర్సంపేట నేషనల్ హైవే పై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆరవయ్య పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ బాబర్ నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు పూర్తిచేసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో శనిగరం క్రాస్ రోడ్డు వద్ద అతివేగంతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బాబర్ కి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై రాజారాం కోన ఊపిరితో ఉన్న బాబర్ ను 108 అంబులెన్స్ వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో బాబర్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరార్ లో ఉన్నట్లు తెలిసింది. ఎస్సై రాజారాంను వివరణ కోరగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Recent Comments