Tuesday, August 12, 2025

బోథ్ నియోజకవర్గ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట…!?

ఇద్దరి వ్యవహార శైలీ తో బోథ్ బీజేపీలో బీటలు వాళుతున్నాయిని సామజిక మద్యామాల్లో ఆ పార్టీ నేతల పోస్టులు….

జిల్లాలో కూడా ఇదే పరిస్థితి…. 

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ – ప్రత్యేకం : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి పార్టీ అధిస్థానం  ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉంటే,  కొన్నిచోట్ల ఆ పార్టీ నాయకుల తీరు ముఖ్య నాయకులను కలవరానికి గురిచేస్తుంది. తాజాగా బోథ్ నియోజకవర్గములో  ఇద్దరి నాయకుల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సామాజిక మాధ్యమాలలో బహిరంగంగా పోస్టులు పెడుతున్నారు.  ఓ పక్కన తెలంగాణ రాష్ట్రంలో 90 సీట్లకు పైగా సాధిస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నరూ.

కానీ గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి మరోలా ఉంది. బోథ్ నియోజకవర్గ ములో రెండు పార్టీలు కొంత సమస్యతో సతమతమవుతున్నయి . రెండు పార్టీల్లోనూ బయటి వారి అవసరం లేదు లేకుండా పార్టీలో ఉంటూ పార్టీనే డ్యామేజ్ చేస్తున్నారని  ఆ పార్టీ నాయకుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. బిజెపి ,  బి ఆర్ ఎస్ పార్టీల్లో  ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

బీజేపీ సీనియర్ నాయకుల సామాజిక మద్యామాల్లో చేసిన పోస్టులు ఈ విధంగా ఉంది….
బోథ్ నియోజకవర్గం లో ఇప్పు డిప్పుడే బీజేపీ బలపడి ఈసారి ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకుంటామని నాయకులు కార్యకర్తలు భావిస్తున్న తరుణం లో ఓ ఇద్దరి వ్యవహారం నియోజక వర్గం లో బీజేపీ ని బారీ స్థాయిలో దెబ్బ తీస్తుంది. ఎన్నడూ బీజేపీ కి ఓటు వేసింది లేదు, బీజేపీ సిద్దాంతం తెలియదు, రెండేళ్ల కిందట పార్టీలో చేరి ఒకరు నామినేటెడ్ పదవి, ఒకరు జిల్లా మోర్చా అధ్యక్ష పదవి తీసుకుని బీజేపీ సీనియర్ నాయకులను, కరుడు గట్టిన కాషాయ కార్యకర్తలను పార్టీకి దూరం చేసి తాము లేకుంటే పార్టీ లేదు తామే పార్టీకి దిక్కు అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇష్టా రీతిన నడుచుకుంటూ పార్టీకి మచ్చ తెస్తున్నారు.
ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి వద్ద  పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని బీజేపీ ని దెబ్బ కొట్టి రాబోయే కాలంలో బీజేపీ క్యాడర్ ను కాంగ్రెస్ వైపు తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ద్వారా బహిర్గతం అయ్యింది. అందుకు తగ్గట్లు గానే ఆ నాయకుడు ఇప్పుడున్న మండలాల అధ్యక్షులను మార్పు చేసి తాను సూచించిన వారిని అధ్యక్షులను చేయాలని పార్లమెంట్ సభ్యులు సోయం బాపురవ్ వద్ద, జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ వద్ద లాబియింగ్ చేస్తున్నారు. ఇప్పటికే వీరు మండలాల నుండి అధ్యక్షులుగా కావాలి అనుకునే వారి వద్ద ఒక ప్రణాళిక ప్రకారం డబ్బులు వసూలు చేసి నిత్యం మందు విందుల్లో మునిగి తేలుతున్నారని కోడై కూస్తుందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు వారు ఎక్కడుంటే అక్కడికి మండలాల అద్యక్షులచే మందు తెప్పించుకుoటున్నరని ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.
మరో నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుల కు సన్నిహితంగా ఉండి నిరుద్యోగ యువత వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తానని తాను ఎంపీ కి అత్యంత సన్నిహితుడ్ని అని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని పోస్టులో పేర్కొంటున్నారు. తీరా ఆ ఎంపీ ఓడిపోవడం బీజేపీ ఎంపీ గెలవడం తో ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చిన యువత తిరగబడడం తో దిక్కు తోచని స్థితిలో తనను తాను రక్షించు కోవడం కోసం ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుల సమక్షంలో పార్టీలో చేరి సోయం బాపురవ్ గారి పేరుతో మళ్ళీ అదే దందా చేస్తున్నారు. ఈ విషయం ఎంపీ గారికి తెలియకుండా యువకులను ఎంపీ గారిని కలవనియకుండా జాగ్రత్త పడుతున్నాడు.
ఉదయం లేచిన దగ్గర నుండి ఎంపీ దగ్గర లేదా బీజేపీ నాయకుడు కంది శ్రీనివాస్ వద్ద వారితో తిరుగుతూ ఉండటం తప్ప పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో వీరు చేసింది శూన్యం. పైగా విరు పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని నాయకుల కార్యకర్తల మనోబావలని దెబ్బ తీస్తున్నారు. పార్లమెంట్ సభ్యులకు వీరి ఆగడాలు తెలియడం లేదన్నది పచ్చి నిజం.
వీరి ఇద్దరి ఎఫెక్ట్ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల మీద కూడా పడనుంది. ఇప్పటికే బోథ్ నియోజక వర్గం లో వీరు ఎంపీ గారిపై తీవ్ర వ్యతిరేకత నెలకొనేల చేశారు. ఇకపై వీరి ఆగడాలు ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ ప్రశ్నర్ధకమే.
ఇప్పటికైనా జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర నాయకులు చొరవ తీసుకుని వీరిని పక్కన పెడితే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. వీరిని ఇలాగే కొనసాగిస్తే పని చేసేందుకు కార్యకర్తలు కూడా దొరకరు అనేది వాస్తవం.

( పైన రాయబడిన సమాచారం బీజేపీ పార్టీ కార్యకర్తలు సామాజిక మద్యామాలతో షేర్ చేస్తున్న వాటితో పాటు నేరుగా తెలుపున్న వాటి  ఆధారంగా వ్రాయబడినది……)


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి