Tuesday, October 14, 2025

కీచక ఉపాధ్యాయుడు ఆగడాలు తట్టుకోలేక విద్యార్ధినుల ఫిర్యాదు

పరారీలో ఉపాధ్యాయుడు

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ : విద్యార్థులకు సంస్కారంతో పాటు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు తన మొబైల్ లో విద్యార్థులను బూతు చిత్రాలు చూపెడుతూ వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దర్జాగా జీతం పొందుతున్నాడు ఒకరోజు పాపం పండుతుంది అనే సామెత మనకు తెలిసే ఉంటుంది అతని చిలిపి చేష్టలతో విసుగు చెందిన విద్యార్థినులు నేరుగా ఉన్నత అధికారులకు లేఖ రాశారు విషయం తెలుసుకున్న నీచుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు . అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ రకమైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఒక్కటే ఉన్నది ఉపాధ్యాయులు తమ మొబైల్ లను కూడా పాఠశాలలో అనుమతి ఇవ్వకూడదని ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్. కొన్ని సందర్భాలలో కొన్ని పాఠశాలలు ఉపాధ్యాయులు డ్యూటీ వేళలోనే తాగి కూడా తందనాలాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ తతంగం విద్యార్థినులు లేఖ రాయడం ద్వారా తెలిసింది. ఒకవేళ అతని చిలిపి చేష్టలు ఈ రకంగానే కొనసాగి ఉంటే రేపటికీ జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా చదువు చెప్పాల్సిన దేవాలయాల్లోని ఈ రకంగా జరుగుతుంటే విద్యార్థినిల తల్లిదండ్రులు ఎక్కడ తమ చదివిపియాలో అని చెప్పేసి భయపడుతున్నారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో మరో కీచక టీచర్ బాగోతం బయటపడింది.  విద్యార్థినిలు ఆ కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తనను తట్టుకోలేక ఉన్నత అధికారులకు లేఖ రాసి పంపించారు.  ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.  విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తన వక్రబుద్ధితో కామాంధుడిగా మారడం విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం తో విసుగు చెందిన విద్యార్థినిలు నేరుగా ఉన్నత అధికారులకు లేఖ రాశారు.  గతంలో కూడా ఆ ఉపాధ్యాయుడు పై ఇదే తరహా ఫిర్యాదు ఉన్నట్లుగా సమాచారం.  ఆ ఉపాధ్యాయుడు తన మొబైల్ లో బూతు వీడియోలు లాంటివి చూస్తూ ఉంటాడని విద్యార్థులు ఆరోపించారు.  విద్యార్థినులను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి బలవంతం చేయడం, ప్రేమ వివాహాల గురించి చెప్పడం పదేపదే ఇలాంటివి చేస్తుండడంతో పాఠశాల విద్యార్థులను విసిగి చెందడంతో విద్య జిల్లా అధికారులకు లేఖ రాయడంతో ఈ తతంగం అంతా బయటపడింది.  నిజామాబాద్ జిల్లా ఎర్రగడ్డ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ వ్యవహారం జరిగినట్లుగా సమాచారం సదరు ఉపాధ్యాయుడు పై విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో సదరు ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నట్లుగా సమాచారం.  గతంలో  విద్యార్థినిలు తమ హెడ్మాస్టర్ కు విషయాన్ని తెలిసిన కూడా ఆయన పట్టించుకోకపోవడంతో ఆ ఉపాధ్యాయుడు మరింత రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయన చేసిన పాఠశాలలో ఫిర్యాదు వచ్చినప్పుడే ఆయనను ఆయనపై కఠిన చర్యలు తీసుకొని ఉద్యోగం నుండి తీసివేస్తే ఇలాంటి చర్యలు పునారోత్సవం కావు కాకపోయేవి అనేది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!