మంచిర్యాల జనవరి 4 ( రిపబ్లిక్ హిందుస్థాన్) :

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలోని ఇక్బాల్ నగర్ లో బుద్ధి చంద్రమౌళి అనే బాధితుడు నూతన ఇంటి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు తన ఇంటిని కూల్చేవేసినారని తెలిపారు. మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ వారి అండ దండలతో అక్రమ కూల్చివేతలకు పాల్పడుతున్నారని, ఇంటి యజమాని బుద్ధి చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను సైతం భేఖాతరు చేసి అక్రమంగా ఇంటిని కూల్చి వేశారని, సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి నిజా నిజాలు పరిశీలించి తనకు న్యాయం చేయాలని బాధితుడు మీడియా ద్వారా కోరారు.


Recent Comments