◾️హత్య మిస్టరీని ఛేదించిన హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి మరియు పాలకవీడు ఎస్ఐ సైదులు
రిపబ్లిక్ హిందుస్థాన్ పాలకవీడు: పాలకవీడుమండలం శూన్య పహాడ్ వద్ద మూసీ నదిలో ఈనెల 19 లభ్యమైన శవంకు సంబందించిన కేసును పోలీసు లు ఛేదించారు. సుపారి ఇచ్చి కొడుకుని హత్య చేయించిన తల్లిదండ్రులే అని నిర్ధారించారు. తల్లిదండ్రులు సహా మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ హత్యకు వినియోగించిన 4 కార్లు,1బైక్, ప్లాస్టిక్ తాడు,రూ.23,500 నగదు స్వాధీన చేసుకున్నారు.
మృతుడు క్షత్రియ సాయినాథ్ (ఫైల్ ఫొటో)
హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి మరియు ఎస్సై సైదులు తెలిపిన కథనం ప్రకారం ... మృతుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన క్షత్రియ సాయినాథ్(26). 18న మిర్యాలగూడ మండలం కల్లేపల్లి మైసమ్మ గుడి వద్ద మద్యం తాపించి ఉరివేసి హత్య చేసిన నిందితులు మద్యానికి బానిసై సాయినాథ్ తల్లిదండ్రులను వేధింపులకు పాల్పడడంతో తట్టుకోలేని తల్లిదండ్రులు రామ్ సింగ్, రాణి బాయ్ రూ.8లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయమన్నట్లుగా తెలిపేరు. తల్లిదండ్రులతో పాటు మరో 5 గురు నిందితులను అరెస్ట్. చెయ్యగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హత్యకు వినియోగించిన 4 కార్లు,1బైక్, ప్లాస్టిక్ తాడు,రూ.23,500 నగదు స్వాధీనం.నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి అనంతరం కోర్టులో రిమాండ్ తరలించిన పోలీసులు.
Recent Comments