రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకుని ఆమె అత్యాచారం కేసులో నేరస్తుడికి
పది సంవ్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2 వెలు జరిమానా విధిస్తూ ఫోక్సో కోర్ట్ న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వెలువరించారు.
కేసు వివరాలలో…..
మహబూబ్నగర్ జిల్లా టట్టుపల్లి చాంద్వా తాండకు చెందిన బోడ సుధాకర్ (27) తండ్రి లోక్వా అనే నిందితుడు 2019 సంవత్సరంలో కూలీలు అవసరం నిమిత్తం ఇంద్రవెల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు వచ్చి కూలీలను పని నిమిత్తం తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా జిహెచ్ఎంసి లో చెట్లు నాటే కార్యక్రమానికి కూడా కొంతమంది కూలీలను తీసుకొని వెళ్ళినాడు. కూలీ పనికి వెళ్లిన ఒక మైనర్ అమ్మాయిని ప్రేమ పెళ్లి పేరుతో లోబరుచుకొని మాయమాటలు చెప్పి తన గ్రామానికి తీసుకొని వెళ్ళాడు. ఆమెను రాత్రి సమయంలో మానభంగం చేశాడు. తండ్రి కుమార్తె కనబడటం లేదని తెలుసుకొని వెతుకుచుండగా అది తెలుసుకున్న నేరస్థుడు బాధితురాలిని ఇంద్రవెల్లి వద్ద వదిలి వెళ్ళగా బాధితురాలి విషయం పోలీసులకు తెలిసి ఆమె వాంగ్మూలము ఆధారంగా అప్పటి ఎస్సై గంగారం క్రైమ్ నెంబర్ 108/2019 తో కేసు నమోదు చేయగా, సీఐ నరేష్ కుమార్ దర్యాప్తు చేసి సెక్షన్ 363,376 (2)(1) IPC, & SEC 4 ఆఫ్ ఫోక్సొ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి, కోర్టు యందు చార్జి షీటు దాఖలు చేశారు.
ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ కోర్టు డ్యూటీ అధికారి సిహెచ్ నరేందర్ సాక్షులను ప్రవేశపెట్టగా ప్రత్యేక పిపి మస్కు రమణారెడ్డి 11 మంది సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా ఫోక్సొకోర్టు న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వెలువరిస్తూ, నిందితుడగు *బోడ సుధాకర్* (27) కు 10 సం”ల కఠిన కారాగార శిక్ష, మరియు రూ 1000/- జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష 4 ఫోక్సో చట్టం కింద , మరియు 363 ఐపిసి కింద రెండు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష రూ 1000/- జరిమానా విధించారు శిక్షలు ఏకకాలంలో అమరు పరచాలని కోర్టు ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం అందించాలని న్యాయ సేవా అధికార సంస్థను కోరారు.
ఇట్టి కేసులో ప్రత్యేక పీపీ ముసుకు రమణారెడ్డిని, కోర్టు డ్యూటీ అధికారి సిహెచ్ నరేందర్ ను, కోర్టు లైసెన్ అధికారి ఎం గంగా సింగు లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారని లైజనాధికారి తెలిపారు.
Recent Comments