రిపబ్లిక్ హిందుస్థాన్, ఖమ్మం : జిల్లాలోని వైరా మండలంలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నా సంఘటన చోటుచేసుకుంది . రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని అన్న గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. తన భార్యతో తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అన్న ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. తమ్ముడిని నరికి చంపిన అన్న అక్రమ సంబంధం వల్లే హత్య చేశానని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చి చెప్పాడు. ఈ సంఘటన వైరా మండలం రెబ్బవరం గ్రామంలో దీపావళి పండగ రోజైన సోమవారం చోటు చేసుకుంది. రెబ్బవరం గ్రామంకు చెందిన సర్పంచ్ సాదం రామారావు, సాదం రామకృష్ణ, సాదం నరేష్ అన్నదమ్ములు. రామకృష్ణ, నరేష్ లు తన తల్లి సుబ్బమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రామకృష్ణ, నరేష్ లకు వివాహం కాగా నరేష్ భార్య రెండేళ్ల క్రితం అతడిని వదిలి వెళ్ళింది. ప్రస్తుతం ఇంట్లో నరేష్, రామకృష్ణ, రామకృష్ణ భార్య,వారి తల్లి సుబ్బమ్మ ఉంటున్నారు. అయితే వారం రోజుల క్రితం తన భార్యతో నరేష్ అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని తాను చూసి ఆగ్రహంతో రామకృష్ణ తన తమ్ముడు నరేష్ ను హత్య చేయాలని పథకం రచించాడు.

Recent Comments