రిపబ్లిక్ హిందుస్థాన్, ఖమ్మం : కొణిజర్ల మండలం లోని కొణిజర్ల , తనికెళ్ళ గ్రామంలో ప్రైమరీ స్కూల్ ను జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను నిర్మాణ, పెయింటింగ్, విద్యుతీకరణ వంటివి పరిశీలించారు. ఇదే సమయంలో విద్యార్థులు మధ్యన భోజనం చేస్తున్నది చూసి, భోజనంలో కోడిగుడ్డు ఇవ్వాల్సి వుండగా విద్యార్థులకు భోజనం తో ఇవ్వక పోవడం తో ఉపాధ్యాయుల పై సిరియస్ అయ్యారు. మీరు పిల్లలకు గుడ్డు ఎందుకు వేయలేదు అని అడిగారు . దానికి హెచ్ఎం కుంటి సాకులు చెప్పడంతో ఎంఈఓ ని పిలిచి ఇది కరెక్టు పద్ధతి కాదు అనే సీరియస్ అయ్యారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం వండుతున్న విధానాన్ని పరిశీలించారు. వంటను శుభ్రమైన వాతావరణం లో వండి, విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కోట్లు రూపాయలు ఖర్చు చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఆదర్శవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Thank you for reading this post, don't forget to subscribe!మన ఊరు మన బడి పనులు పరిశీలించిన కలెక్టర్
Previous article
Recent Comments