కాంగ్రెస్ నేతల నిరసన… అరెస్ట్… ఉద్రిక్తత…..
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ గా డాక్టర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఆందోళనకు దారి తీసింది. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బేలా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేసేందుకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేల స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసులు ఎక్కువగా ఉండే బేలా మండలంలో వైద్య సదుపాయం సైతం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ లేక నెలలు గడుస్తున్నప్పటికీ వైద్యున్ని నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీంతో వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.గత కొన్ని రోజుల క్రితం కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయితే బేలలో వైద్యులు లేక విద్యార్థులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సైతం వైద్యుల నియామకాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో డాక్టర్ ను నియమించకుంటే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పైజుల్లా ఖాన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్,ఉల్కే,కిసాన్ సెల్ బేల మండల అధ్యక్షుడు గన్ శామ్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజీవ్ గుండావర్, ఎస్టి సెల్ బేల మండల అధ్యక్షుడు చంద్రకాంత్, మండల అధ్యక్షుడు విట్టల్,అఖిల్,అవినాష్, శంకర్,విపిన్,రాకేశ్,విజయ్, మాజీ సర్పంచ్ అయ్యు,మాజీ సర్పంచ్ భారత్,రాందాస్ విజయ్,కృష్ణ వాగు,బాపురావు శంభు,గణేష్ నరేందర్,దత్త నానాజీ గంభీర్,గొడే గాన్ శ్యామ్,సూర్యబాన్, తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments