ఇంద్రవెల్లి ఎస్ఐ ఎన్ నాగ్ నాథ్, హెడ్ కానిస్టేబుల్ జె దేవీలాల్ లను ఎఅర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శనివారం రోజు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత ఆదివారం తేదీ 19-06-2022 రాత్రి ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ గ్రామ శివారులోని ఒక కొట్టంలో పేకాట ఆడుతున్నట్టు జిల్లా ఎస్పీ సమాచారం రాగా, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ని నియమించగా, ఆయన సంఘటన స్థలంలో తోమిది మంది నిందితులను పట్టుకొని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కోసం అందజేయడం జరిగింది. వీరి వద్దనుండి పేకాట ముక్కలు, రూ.69,141/- స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
*నిందితుల వివరాలు*
1) ఎస్ కె యూనిస్. 2) సి హెచ్ దశరథ్. 3) సి హెచ్ కిషోర్. 4) ఎస్ కె గౌస్. 5) డబ్లూ జగ్జీవన్. 6) ఎస్ కె షఫి. 7) ఎన్ అర్జున్. 8) ఎ ప్రహ్లాద్. 9) జె దేవీలాల్ – హెడ్ కానిస్టేబుల్
లు పాల్గొనడం జరిగింది, నిందితులను విచారించగా షఫీ r/o దేవాపూర్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నాడని తెలిసింది. ఇట్టి పేకాట స్టావరాలను కనిపెట్టడంలో విఫలమైనందున ఇంద్రవెల్లి ఎస్ఐ నాగ్ నాథ్ ను, పేకాట ఆడిన హెడ్ కానిస్టేబుల్ జె దేవి లాల్ ను ఎఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల కైన వాటికి సహకరించే పోలీసులపైనా ఒకే రకమైన న్యాయం జరుగుతుందని చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని తెలిపారు. జిల్లాలో ప్రజలందరికీ మీ గ్రామాల పరిధిలో కానీ, పట్టణంలో గాని ఎటువంటి అసాంఘిక చర్యలు తమ దృష్టికి వస్తే వెంటనే స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణ మూర్తి 9490619548, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి 9440900635 లకు వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా గాని సమాచారం అందించగలరని, సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments