రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
బుధవారం రొజు బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గ నాయకులు అడే గజేందర్ ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అని అన్నారు. ఎండ తీవ్రతను చూసుకుంటూ బయట పనులు చేయాలని అత్యవసరంలోని బయటకు రావాలని సూచించారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు సెలవులలో జాగ్రత్త వహిస్తూ బయటకు రావాలని తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపవద్దని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంలోని ఎస్బిఐ చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఇట్టి కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్మె మహేందర్,పట్టణ అధ్యక్షుడు సల్ల రవి,కిసాన్ సెల్ నాయకులు బొడ్డు గంగారెడ్డి, సీనియర్ నాయకుడు, మెరుగు బోజన్న, రాజాశేఖర్,మైనార్టీపట్టణ అధ్యక్షుడు హసిఫ్,యువనాయకుడు అబ్రార్,శీను తదితరులు పాల్గొన్నారు.
Recent Comments