— జిల్లా పాలనాధికారిణి నిఖిల
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, వికారాబాద్ : జిల్లా పరిధిలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న ఆయుష్ వైద్యులను త్వరలో భర్తీ చేస్తామని జిల్లా పాలనాధికారిణి నిఖిల వెల్లడించారు. వికారాబాద్ మండల పరిధిలోని సిద్ద లూరు గ్రామంలో గత మూడు రోజుల నుంచి ఆయుష్ వైద్యశాఖ ఆదేశానుసారం, జిల్లా ఇంచార్జ్ ఆయుష్ వైద్యులు జలాలుద్దీన్ ఆధ్వర్యంలో ఆయుష్ గ్రామంలో భాగంగా ప్రజలకు ఆయుష్ వైద్య సేవలు అందించారు. ఈ మూడు రోజుల ఆయుష్ గ్రామ వైద్య శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పాలనాధికారిణి, శాసనసభ్యులు డాక్టర్ ఆనంద్ హాజరై ఆయుష్ వైద్యులతో మాట్లాడారు.. ఆయుష్ వైద్యంతో ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్ వైద్యం సాంప్రదాయక వైద్యం అని ప్రజలలో సంప్రదాయ వైద్యానికి ఇప్పటికీ నమ్మకం ఉందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయుష్ వైద్యులు సంప్రదాయ వైద్యం ప్రజలకు అందించాలని ఆయుష్ వైద్యులకు సూచించారు. జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో ఆయుష్ గ్రామాలుగా ఎంపిక చేసి వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. తాము గ్రామీణ ప్రాంతాలలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆయుష్ వైద్యులతో తమ అనుభవాలను పంచుకున్నారు. యోగా షెడ్లు నిర్మించడానికి జిల్లాకు రూ. 60 లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలో యోగా షెడ్ల నిర్మాణం పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తద్వారా గ్రామంలోని ప్రజలందరూ సమయానుసారంగా యోగ వైద్యుల సమక్షంలో యోగ ఆసనాలు నేర్చుకుంటారని తద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, వైద్యులు సునీత, వైద్యులు గోపాల్, వైద్యులు మహేశ్వరి, బి ఆర్ కే ఆయుష్ కళాశాల ఆచార్యులు, సహచా ర్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Recent Comments