రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : మండల కేంద్రంలో గురువారం రోజున రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ రహదారి 44 సర్వీస్ రోడ్డు నుండి చర్చి వరకు 10లక్షల నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకన్ని ప్రారంభించారు.అనంతరం స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,బోథ్ ఎమ్మెల్యే రాతోడ్ బాపూరావు,ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, తెరాస జిల్లా అధ్యక్షురాలు సర్పే సోంబాయి,మండల అధ్యక్షులు ఖరాడ్ బ్రహ్మానంద్,ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Recent Comments