రిపబ్లిక్ హిందుస్థాన్ , తుర్కపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా లోని తుర్కపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తో పాటు సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశ కార్యకర్త కరోనా వ్యాక్సిన్ వేయడంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు సీరియస్ అయ్యారు. పల్లెపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మారం గ్రామంలో ఆశ కార్యకర్త జి విజయ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న ఫోటో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు దృష్టికి వచ్చింది వెంటనే ఆయన ఈ విషయంపై సీరియస్ అయ్యారు తుర్కపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ చంద్రారెడ్డి సెకండ్ ఏఎన్ఎం పద్మావతి ఆశ కార్యకర్త విజయ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్య అధికారి పర్యవేక్షణ లేకుండా ఆశ కార్యకర్త వ్యాక్సిన్ ఇవ్వడం తప్ప అని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విధులు పై నిర్లక్ష్యం వహించడం పై ఆయన షోకాజ్ నోటీసులు ప్రశ్నించారు. సిబ్బందిపై సి సి ఏ రూల్స్ 1991 ప్రకారం అం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఆశ కార్యకర్త వ్యాక్సిన్ ఇవ్వడం తో వైద్యాధికారి కి షోకాజ్ నోటీసు
RELATED ARTICLES
Recent Comments