జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ కు చెందిన తెరాస నేత చెదలు రాజేందర్ (48) ను , అతడి వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడు రాజేందర్ మూడేళ్ళ క్రితం గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి పై తుపాకితో కాల్పులు జరిపిన సంఘటనలో ప్రధాన నిందితుడని తెలిసింది.

వారిరువురు మధ్య భూతగాధాలు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజేందర్ దారుణ హత్య గ్రామంలో కలకలం రేపింది.
Recent Comments