ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఫైనాన్స్ నిర్వహించాలి – జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపీఎస్
Thank you for reading this post, don't forget to subscribe!ఈ రోజు జిల్లా ఎస్పీ గారు జిల్లా పరిధిలోని నిర్మల్, భైంసా పట్టణాల్లో అక్రమ ఫైనాన్సు, వడ్డీ వ్యాపారం చేస్తున్నా ఫైనాన్సు పై తనిఖీలు నిర్వహించలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ప్రజలు తమకు ఉన్న అత్యవసర పరిస్థితి, తాత్కాలిక ఇబ్బందులకోసం అధిక మొత్తంలో అవసరంకి మించి అధిక వడ్డిలకు అప్పులు చేసి తరువాత ఆ అప్పులు, అధిక వడ్డీలు చెల్లించ లేక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు పోలీస్ వారికి తెలియపరిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదు కానీ RBI నియమనిబందనలు, తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు. కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
Recent Comments