మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ ఐ సుధాకర్ లు హత్య కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు ప్రకారం…
రామకృష్ణాపూర్ లోని శాంతి నగర్ లో దామా మహేందర్ అనే వ్యక్తి మరియు కదుర్ల సంతోష్ , కదుర్ల శ్రీనివాస్ , కదుర్ల వసంత లు నివశిస్తుంటారూ.
5 సం. ల క్రితం దామా మహేందర్ కు మరియు అదే కాలనీ కి చెందిని మరో వ్యక్తి తో నీటి పంపుల విషయం లో గొడవ జరిగింది.
ఆ సమయములో నిందితుల్లో ఒకరైన కదుర్ల శ్రీనివాస్ సాక్షి గా వుండెను.
అప్పటి నుండి దామా మహేందర్ కు నిందితుల కుటంబసభ్యులకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమములో తేదీ 10-01-2022 రోజు , ఉదయం సమయములో దామా మహేందర్ నిందితుల ఇంటిచుట్టు మరియు ఇంటి ముందర తిరగడం మొదలుపెట్టాడు . తరువాత కొద్దిసేపటికి , మళ్ళీ దామా మహేందర్ కదుర్ల సంతోష్ ఇంటిలోకి వచ్చి భూతులు తిడుతూ , చంపుతానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇంట్లో వున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయినాడు.
అప్పుడు అతని పెట్టె వేదింపులకు విసుగు చెంది , దామా మహేందర్ మళ్ళీ వచ్చి గొడవ చేస్తే అతన్ని చంపాలని నిందితులు నిర్ణయించుకున్నారు ..అదే రోజు మద్యాహ్నం సమయములో, మళ్ళీ దామా మహేందర్ మద్యం త్రాగి నిందితుల ఇంటికి వెళ్ళి గొడవ చేస్తుండగా నిందితులు అనుకున్న ప్రకారం దామా మహేందర్ కంట్లో కారం చల్లి , కత్తి తో గొంతు కోసి , గొడ్డలితో మెడ ,తల పై నరికి చంపినారు.
హత్య అనంతరం నిందితులు పరారు అయ్యారు. ఇట్టి హత్య విషయం లో మృతుడైన దామా మహేందర్ యొక్క అన్న శ్రీనివాస్ యొక్క ఫిర్యాదు పై రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్ లో హత్య నేరం క్రింద నిందితుల పై కేసు నమోదు చేయనైనది. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు బుధవారం రోజు ఎస్. ప్రమోద్ రావు , సర్కల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, మందమర్రి గారు పరారీ లో వున్న పై నిందితులను అరెస్టు చేసి వారివద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తిని మరియు గొడ్డలని స్వాదిన పర్చుకొని , ముగ్గురు నిందితులు ఏ1 కదుర్ల సంతోష్, ఏ 2 కదుర్ల శ్రీనివాస్ , ఏ3 కదుర్ల వసంత లను రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments