దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మహారాజ్
ఇచ్చోడ: బాదితులను పాలకులుగా చేయడమే డీ ఎస్ పి ఉద్యమ లక్ష్యమని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మహారాజ్ అన్నారు. ఆదివారం డి ఎస్ పి మండల అధ్యక్షులు శేఖర్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలం అడేగాం కె నుంచి గుండివాగు వరకు 15కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టిన సందర్బంగా మాట్లాడారు. అడే గాం కె లో అంబేద్కర్ విగ్రహానికి పూలు సమర్పించి పాదయాత్ర ప్రారంభించి మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కేంద్రంగా కోవిడ్ నిబంధనల ప్రకారంగా వాయిదా పడ్డ డీఎస్ పి స్వరాజ్య పాదయాత్రను త్వరలోనే 10 వేల కిలోమీటర్ల పాదయాత్ర తేదీని డీఎస్ పి అధినాయకత్వం ప్రకటిస్తుందన్నారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలతో ముందుకు వెళుతూ స్వశక్తితో బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్యాన్ని సాధించడం కోసం డి ఎస్ పి ఉద్యమం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం మండల ఉపాధ్యక్షులు అశోక్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ఎ. లక్ష్మణ్ మహారాజ్, కార్యదర్శి జి లక్ష్మణ్ మహారాజ్, కోశాధికారి ప్రవీణ్ మహారాజ్, భూమన్న మహారాజ్, నరేష్ మహారాజ్, శంకర్ మహారాజ్, బీసీ ఎస్టీ,ఎస్సి నాయకులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.
Recent Comments