
రిపబ్లిక్ హిందుస్థాన్ , కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి 161పై పెద్ద కొడప్గల్ మండలంలోని జగనాథ్ పల్లి వద్ద ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కాగా మరో నలుగురిలో ఇద్దరు ఆడ, ఇద్దరు మగవారు ఉన్నారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments