గత సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇచ్చోడ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి, నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా. రెండవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసంద ర్బంగా ఉపాధ్యాయులు, అధికారులకు ప్రింట్ మీడియా తరుపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు ,పాత్రికేయులు గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారూ.
ఈ సందర్బంగా తాహశీల్ధార్ అతిఖోద్దీన్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ రమేష్ బాబు, ఎంపీడీవో రామ్ ప్రసాద్, ఎంఈవో రాథోడ్ ఉదయరావ్ తో పాటు ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికైన దేవర్ల సంతోష్ కుమార్ (పిప్పిరి), నైతం జైతు (సిరికొండ), జగన్ మోహన్ రెడ్డి (గేర్జము), బొంగురాల ప్రహ్లాద్ (అడేగామ కే), జియా (ఉర్దూ స్కూల్ ఇచ్చోడ)కు ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో వారికి పూల మాలలు వేసి, శాలువ లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు సన్మానం….
RELATED ARTICLES
Recent Comments