జెద్దా, ఏప్రిల్ 3: అల్కిఫాహ్ టోర్నమెంట్ నెంబర్ 2026-123 గ్రాండ్ ఫినాలే మ్యాచ్ ఘనంగా నిర్వహించబడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ పోరులో రెండు జట్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను అలరించాయి.
మ్యాచ్ ఫలితాలు ఇలా ఉన్నాయి: గోల్డెన్ సీసీ జట్టు 15 ఓవర్లలో 204 పరుగులు చేయగా, ఈజాక్ సీసీ జట్టు 15 ఓవర్లలో 202 పరుగులు చేసి కేవలం 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చివరి వరకూ ఉత్కంఠను రేపిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఈ టోర్నమెంట్ను హైదరాబాద్కు చెందిన నయీమ్ నాయకత్వంలోని అల్కిఫాహ్ ఆర్గనైజింగ్ టీం 2016 నుండి జెద్దాలో విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా SATA వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశన్ ముఖ్య అతిథిగా హాజరై, విజేతలు మరియు రన్నరప్ జట్లకు ట్రోఫీలను అందజేశారు.
టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో ముజ్జమ్మిల్, అజామ్ షకీర్ భాయ్, రహ్మత్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇలాంటి మరెన్నో విజయవంతమైన టోర్నమెంట్లు భవిష్యత్తులో కూడా నిర్వహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.



Recent Comments