తేది: 09-10-2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం
చవితి: ఉదయం 6:58 వరకు, తదుపరి పంచమి
అనూరాధ నక్షత్రం: రాత్రి 11:36 వరకు, తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: తెల్లవారు జామున 5:29 నుండి
అమృత ఘడియలు: మధ్యాహ్నం 12:29 నుండి 2:12 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:12 నుండి 12:59 వరకు, తిరిగి 2:33 నుండి 3:21 వరకు
రాహుకాలం: ఉదయం 7:30 నుండి 9:00 వరకు
సూర్యోదయం: ఉదయం 5:54
సూర్యాస్తమయం: సాయంత్రం 5:43
రాశిఫలాలు
మేషం (Aries):
ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృషభం (Taurus):
బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.
మిథునం (Gemini):
ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు.
కర్కాటకం (Cancer):
మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి.
సింహం (Leo):
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శతృవులమీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
కన్య (Virgo):
ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.
తుల (Libra):
ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు.
వృశ్చికం (Scorpio):
ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు చేయడానికి అనుకూలమైన సమయం. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ధనుస్సు (Sagittarius):
మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలు అందివస్తాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
మకరం (Capricorn):
ఈ రోజు మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభం (Aquarius):
మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలు అందివస్తాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
మీనం (Pisces):
ఈ రోజు మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం.
Recent Comments