చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి , లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఎంపీ
Thank you for reading this post, don't forget to subscribe!న్యాయం జరిగేలా చూస్తామని చిన్నారి కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి భరోసా…
రిపబ్లిక్ హిందూస్థాన్, సైదాబాద్ : సింగరేణి కాలనీలో చిన్నారి కుటుంబ సభ్యులను భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు లక్షరూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. కుటుంబానికి అన్నివేలలో అండగా ఉంటానని భరోసాని కల్పించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరిచి ఉరిశిక్ష వెయ్యాలని అన్నారు.
సీఎస్ సోమేశ్ కుమార్ తో జరిగిన సంఘటన గురించి ఫోన్ లో ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడారు.
మంత్రి సత్యవతి రాథోడ్ కి ఫోన్ చేస్తే నేను ఎందుకు రావాలి అంటుందని కోమటిరెడ్డికి స్థానికులు తెలపటం తో వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ తో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం కోమటిరెడ్డి చేశారు మంత్రి ఫోన్ కి స్పందించకపోవటంతో కోమటిరెడ్డి ఆగ్రహించారు..
రాష్ట్రంలో ప్రభుత్వం లేదు అనటానికి ఈ సంఘటన నే నిదర్శనం. రాష్ట్రం లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న కేసీఆర్ స్పందించడం లేదు
సింగరేణి కాలనీ ని సింగపూర్ చేస్తాను అని చెప్పి గంజాయి కి అడ్డా గా మార్చారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉన్నా లేనట్టే ఉంది. తెలంగాణ లో జరుగుతున్న అత్యాచారాల , హత్యల త్వరలోనే రాష్ట్రపతి ని కలుస్తాననీ అన్నారు.
రాష్ట్ర మంత్రులు సంఘట స్థలానికి రాకపోవడం సిగ్గుచేటని అన్నారు.
Recent Comments