సరైన వాహన పత్రాలు లేని 53 బైక్ లు , 12 ఆటోలు స్వాధీనం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
అదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు గౌరవ ఉట్నూర్ డిఎస్పీ సి హెచ్ నాగేందర్ ఆధ్వర్యంలో నార్నూర్ సీఐ మరియు ఎక్సైజ్ సి.ఐ మరియు గాదిగూడ మరియు నార్నూర్ ఎస్.ఐ లు మరియు సిబ్బంది కలిసి గాదిగూడ మండలంలోని మేడిగూడ గ్రామం నందు ఆదివారం రోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ / కార్డన్ మరియు శోధన నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో మెడిగుడ గ్రామంలో అక్రమంగా దొంగ సారా/గుడుంబా కాస్తున్న గుల్వే రాహుల్ వద్ద 10 లీటర్లు గుడుంబా స్వాదీనం చేసుకోవడంతో పాటు, గ్రామంలో సరైన వాహన పత్రాలు లేని 53 బైక్‌లు మరియు 12 ఆటోలు ను స్వాధీన పరుచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పీ సిహెచ్ నాగేందర్ మాట్లాడుతు,సిసిపి ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యత, సిసిటివి కెమెరాలు, వాహన పత్రాలు, విద్య యొక్క ప్రాముఖ్యత మరియు మద్య వ్యసనం మరియు దాని ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం పై ఆ గ్రామ ప్రజలు కూడా సానుకులంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ సిఐ ప్రేమ్ కుమార్ , గాదిగూడ ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments