మంచిర్యాల ఫిబ్రవరి 6 (రిపబ్లిక్ హిందుస్థాన్)
మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక అక్రమ నిర్మాణాలకు పెట్టింది పేరుగా మారింది.అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు పొందుతున్నారు.అక్రమ నిర్మాణాలు కొందరు ప్రజా ప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి.అసైన్డ్ భూముల అమ్మకం,కొనుగోళ్లు చేయరాదనే నిబంధన ఉన్నా అవి ఇక్కడ అమలు కావడం లేదు.ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులే ఈ దందాను యథేచ్ఛగా చేస్తున్నారని ప్రజలు గుస గుసలాడుతున్నారు.ఎకరాల చొప్పున కొనుగోలు చేసి గుంటల చొప్పున ప్లాట్లుగా తయారు చేసి అమ్ముతున్నారు.వారే అన్నీ చూసుకొని అడ్డదారిలో ఇంటి నంబర్లు కూడా ఇప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.గెర్రెకాలనీ సమీపంలోని సర్వేనెంబర్ 863లో 8.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా నూరు శాంతం భూమి కబ్జా చేశారు.కొందరు ఇల్లు నిర్మించుకోగా,మరికొందరు నిర్మాణ పనులు చేపట్టారు.ఈ సర్వే నెంబర్ భూమిలోని రెండు ఎకరాల భూమిని ఇటీవల ఓ ప్రజాప్రతినిది అతని అనుచరగణం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు.ఇది విలువైన భూమి కావడంతో ఒక్కరిద్దరూ బడా నేతలు తెరవెనకాల ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.గెర్రెకాలనీలో సర్వేనెంబర్లు 858, 859,869,883 లో ఉన్న అసైన్డ్ భూములను రియల్టర్లు రాజకీయ నాయకుల అండదండలతో కొనుగోలు చేసి గుంటల చొప్పున ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.కోట్ల విలువైన ప్రభుత్వ,అసైన్డ్ భూములను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన విలేకరులు:
చెన్నూర్ విలేఖరులకు ప్రతిపాదించిన భూమి(సర్వే నెంబర్ 863) లోని రెండు ఎకరాల భూమి అమ్మకాలు జరిగి చేతులు మారాయని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని తహసిల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే కు విలేఖరులు వినతిపత్రం అందజేశారు.
తహసిల్దార్ వివరణ కోరగా సర్వే నెంబర్ 863 లో 8.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని,అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని ఈ స్థలంలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులకు నివేదికలు అందజేసి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments