ఆదిలాబాద్ జిల్లా, ఆగస్టు 30 :
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. గుడ్డిగా నమ్మి డబ్బులు కోల్పోకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడిన బోయవాడకు చెందిన ఠాకూర్ విజయ్ సింగ్ s/o సుందర్ సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడు Myv3ads అనే అప్లికేషన్ లో నమోదు చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికి, నమోదు కోసం ఒక్కొక్కరికి ₹1,21,000/- వసూలు చేశాడు. ఇద్దరు వ్యక్తుల వద్ద ఇలాగే డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శుక్రవారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ అప్లికేషన్ ద్వారా మరెవరు మోసపోయిన వారు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశలపై నేరగాళ్లు లాభం పొందే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
ఈ అరెస్టు కార్యక్రమంలో ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments