Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జొన్న లాప తిని 20 ఆవులు మృతి

Author
Posted By HINDUSTAN
| 02 May 2025, 07:05 PM | క్రైమ్ న్యూస్
జొన్న లాప తిని 20 ఆవులు మృతి


ఆర్థిక సాయం కోరుతున్న రైతులు



రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ :  బజార్ హత్నూర్ మండలం, బుర్కపల్లి గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజువారీగా మేతకు వెళ్లిన 20 ఆవులు జొన్న లేత మొలకలు (లాప) తినడం వల్ల మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి గిరిదావర్ రాథోడ్ నూర్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, గ్రామ రైతులతో మాట్లాడారు. జొన్న లేత మొలకలు మేయడం వల్ల ఆవులు మరణించినట్లు రైతులు తెలిపారు.



మరణించిన ఆవుల యజమానుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:




  1. బర్ధవాల్ నానాక్ సింగ్ - 3 ఆవులు


  2. టాక్ డా నానాక్ సింగ్ - 4 ఆవులు


  3. మాటవాన్ గులాబ్ సింగ్ - 1 ఆవు


  4. సబడే చందర్ సింగ్ - 1 ఆవు


  5. బర్ధవాల్ గురువే సింగ్ - 1 ఆవు

  6. ఇవి కూడా చదవండి


  7. జాతీవే న్యాల్ సింగ్ - 1 ఆవు


  8. జాతీవే సుభాష్ - 1 ఆవు


  9. నిస్తే హుషార్ సింగ్ - 2 ఆవులు


  10. బనియ రామ్ - 1 ఆవు


  11. భామన్ పర్షు రామ్ - 1 ఆవు


  12. బస్సి హర్ సింగ్ - 1 ఆవు


  13. మాటవాన్ కాపుర్ చందు - 2 ఆవులు


  14. మాటవాన్ గోపి చందు - 1 ఆవు



మొత్తం 13 మంది రైతులకు చెందిన 20 ఆవులు మరణించాయి. ఒక్కో ఆవు సుమారు 20,000 రూపాయల విలువైనదని, మొత్తం 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తమ జీవనాధారమైన ఆవులను కోల్పోయిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.



రైతులు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అధికారులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు.