• మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి డీజే లు ఉపయోగిస్తే కేసులు తప్పవు
• నిబంధనలు అతిక్రమించిన డీజే లు సీజ్ చేసి, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు అని హెచ్చరిక
• గణపతి మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మండపం వద్ద సౌండ్ బాక్స్ లకు, మైక్ సెట్ లకు డిఎస్పి అనుమతి తప్పనిసరి
– ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్, ఆగస్టు 21, 2025 : ఆదిలాబాద్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు డీజేలపై పూర్తి నిషేధం విధించినట్లు ప్రకటించారు.
మహారాష్ట్ర నుండి డీజేలు తీసుకొచ్చి ఉపయోగిస్తే సీజ్ చేసి, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గణపతి మండపాలకు పోలీసు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సౌండ్ బాక్సులు, మైక్ సెట్లకు డిఎస్పీ కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్‌లో గణపతి ఏర్పాటు, నిమజ్జనం తేదీలు, దారి, నిర్వాహక కమిటీ సభ్యులు, వాలంటీర్లు, వాహనం, గణపతి, మండపం ఎత్తు వివరాలు నమోదు చేయాలి. మహారాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అనధికారిక డీజేలను సీజ్ చేస్తామని తెలిపారు.
యువత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, డీజీలకు అనవసర ఖర్చు చేయవద్దని సూచించారు. సౌండ్, మైక్‌లకు అనుమతి తీసుకున్న తర్వాతే అడ్వాన్స్ చెల్లించాలని డిఎస్పీ తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments