Saturday, March 22, 2025

ద్విచక్ర వాహనం కోసమే యువకుడి దారుణ హత్య

ఇద్దరు నిందితులు అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం.
హత్య మిస్టరీని ఛేదించిన జైనథ్, సిసిఎస్ పోలీసులు.

డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జైనథ్, సిసిఎస్ సీఐలు మూడు బృందాలుగా ఏర్పడి 15 రోజుల్లోనే చేదించిన హత్యోదంతం.

పాత్రికేయుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ప్రణాళిక ప్రకారం సమాచార వ్యవస్థను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవడంతోపాటు, సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తున్న జిల్లా పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించి జటిలమైన కేసులను సైతం చేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి హత్య మిస్టరీని ఛేదించిన తీరు, నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 1న జైనథ్ మండల కేంద్రంలోని తరుణం గ్రామం మీదుగా వెళ్లే బోరజ్ చంద్రపూర్ రహదారిలో యువకుడి గొంతుకోసి హత్య చేసి రోడ్డు పక్కన పాడేసి శవం కనబడకుండా ముళ్ళకంప అడ్డుగా పెట్టి ఉన్న ఉదంతంపై ఈ నెల 4న జైనథ్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని మృతదేహం హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇట్టి కేసును తీవ్రంగా పరిగణించడంతో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జైనథ్ సిఐ కొంక మల్లేష్, సిసిఎస్ సిఐ ఈ. చంద్రమౌళి, మూడు బృందాలుగా దర్యాప్తు కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంగంలోకి దిగిన సిఐలు ముందుగా గుర్తు తెలియని మృతదేహంను ఆదిలాబాద్ పుత్లిబౌలికి చెందిన ఇందూరు గజానంద్ (36)గా గుర్తించి గత 15 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించి దర్యాప్తుని వేగవంతం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం, స్థానికంగా సేకరించిన సాక్ష్యాధారాలతో గుర్తించిన నిందితులు బంగారిగూడ ఆదిలాబాద్ కు చెందిన షేక్ అస్లాం (22) ఎటుకోక విజయ్ (20) ఇరువురు వ్యక్తులు జనవరి 1న ఎన్టీఆర్ చౌక్ వద్ద ఉండగా హతుడు ఇందూరు గజానంద్ తన ద్విచక్ర వాహనం హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ను తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులు గమనించి మాయమాటలతో తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పిస్తానని నమ్మించి చీకటి పడే వరకు శాంతి నగర్, వినాయక చౌక్, గాంధీ చౌక్ అదే ద్విచక్రవాహనంపై తిప్పుతూ చివరికి తరుణం గ్రామం మీదుగా వెళ్లే భోరజ్ చంద్రపూర్ రహదారి వైపు తీసుకెళ్లి ద్విచక్ర వాహనం యజమానిని గొంతు కోసి హత్య చేసి రోడ్డు పక్కన పడేసి కనబడకుండా ముళ్ళకంప అడ్డుగా పెట్టి ద్విచక్ర వాహనంను దొంగలించి పారిపోయారని తెలిపారు.  పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్లో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 21న శుక్రవారం సాయంత్రం అదిలాబాద్ పట్టణంలో  ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను విచారించగా గజానంద్ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగలించాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. పటిష్టమైన సాక్ష్యాధారాలు, సాంకేతిక పరిజ్ఞానం జోడించి కేసు దర్యాప్తును పూర్తి చేసి న్యాయస్థానంలో ఇరువురు నిందితులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయస్థానంలో తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. గుర్తుతెలియని శవంను ముందుగా గుర్తించి హత్యకు దారి తీసిన ఉదంతాన్ని చాకచక్యంగా దర్యాప్తు చేసి చేదించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు, జైనథ్ సిఐ కొంక మల్లేష్, రూరల్ సీఐ కే పురుషోత్తం చారి, రూరల్ ఎస్ఐ ఏ హరిబాబు,బేల ఎస్ఐ కృష్ణకుమార్, బృందం సభ్యులను అభినందిస్తూన్నట్లు పేర్కొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి