Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇక నుండి ATM లో రేషన్ బియ్యం..!?

Author
Posted By HINDUSTAN
| 09 Aug 2024, 06:14 AM | జాతీయం
ఇక నుండి ATM లో రేషన్ బియ్యం..!?



హైదరాబాద్ : ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవటం మీరు చూసిఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు.?



ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభ మైంది. ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం మిషన్ నుంచి బియ్యాన్ని తీసుకో వచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.



ఒడిశా ప్రభుత్వం భువ నేశ్వర్ లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీరన్ పై నమోదు చేయాలి.


ఇవి కూడా చదవండి


ఆ తరువాత వేలిముంద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు.



ఈ విధానం ద్వారా బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనే శ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు.



ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచన లో ప్రభుత్వం ఉంది. ప్రస్తు తం ఈ మోడల్ విజయ వంతం అయితే.. రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది.