Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యావసరాలు..

Author
Posted By HINDUSTAN
| 24 Feb 2024, 12:28 PM | క్రైమ్


బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యావసర వస్తువులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. నలుగురిని ఈస్ట్‌ జోన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.



రెడ్‌లేబుల్‌, బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌, లైజాల్‌, హార్పిక్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, ఎవరెస్ట్‌ మసాలా, పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్‌ పేరుతో నకిలీవి తయారు చేస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్‌ తెలిపారు. కాటేదాన్, నాగారం ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశామన్నారు. నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. బిహార్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన నిందితులు.. నకిలీ వస్తువులను నగరంలోని వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మార్కెట్‌ ధర కంటే తక్కువకే వీటిని డిస్టిబ్యూటర్లకు విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు.


ఇవి కూడా చదవండి


ప్రజలు సమాచారం ఇవ్వాలి..



నకిలీ నిత్యావసర వస్తువులను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కొందరు వ్యాపారులు, దుకాణాదారులు నకిలీ వస్తువులని తెలిసినా కస్టమర్లకు విక్రయిస్తున్నారని చెప్పారు. వినియోగదారులు నకిలీ వస్తువులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.