బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యావసరాలు..

బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యావసర వస్తువులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. నలుగురిని ఈస్ట్‌ జోన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌లేబుల్‌, బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌, లైజాల్‌, హార్పిక్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, ఎవరెస్ట్‌ మసాలా, పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్‌ పేరుతో నకిలీవి తయారు చేస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్‌ తెలిపారు. కాటేదాన్, నాగారం ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశామన్నారు. నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. బిహార్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన నిందితులు.. నకిలీ వస్తువులను నగరంలోని వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు...