Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

Author
Posted By HINDUSTAN
| 25 Jan 2024, 12:18 PM | వరంగల్ రూరల్


వరంగల్ జిల్లా :జనవరి 25
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లోని జల్లి గ్రామ తండాలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.

భర్త వేధింపులు తాళలేక భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన జర్పుల ప్రవీణ్ కి స్వరూపతో 24 సంవత్స రాల క్రితం వివాహామైంది.

ప్రవీణ్ పెండ్లి అయినప్పటి నుండి స్వరూప ను ఇష్టానుసారంగా కొట్టేవాడు. అతని వేధింపులతో గతంలోనే భార్య రెండు సార్లు చావడానికి ప్రయత్నం చేసింది. ఎన్నోసార్లు పెద్దమనుషులు పంచాయతీలు చేసి భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేశారు.

వీరి కుమారుడు ఇటీవలే చేసుకున్న వివాహం విషయంలోనూ స్వరూపను ప్రవీణ్ నువ్వే కారణ మంటూ కొట్టాడు. బుధవారం సాయంత్రం మధ్యం మత్తులో ఇంటికి వచ్చి స్వరూపను తీవ్రంగా కొట్టి, ఏదైనా మందు తాగి చావు అని బెదిరించాడు.

దీంతో భర్త టార్చర్ భరించలేక స్వరూప బుధవారం రాత్రి పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయింది.

మృతురాలి తల్లి భూక్య మల్లికాంబ ఫిర్యాదు మేరకు ప్రవీణ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పి.శ్రీనివాస్ తెలిపారు..