Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అమాయక ఆదివాసీల వద్ద డబ్బులు వసూలు చేసినచో కఠిన చర్యలు తప్పవు - జిల్లా ఎస్పీ

Author
Posted By HINDUSTAN
| 03 Apr 2023, 03:01 PM | న్యాయ వ్యవస్థ


▪️సర్వేనెంబర్ 72 వ్యవహారం కోర్టు నందు పెండింగ్లో ఉంది.... ▪️ఆదివాసీలు నాయకులను నమ్మి మోసపోవద్దు, వ్యవహారం కోర్టు నందు తేలే వరకు సంయమనం పాటించాలని  సూచించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం ద్వారా జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని గత కొంతకాలంగా సర్వే నెంబర్ 72 భూ తగాదా వ్యవహారం కోర్టు నందు పెండింగ్లో ఉంది, దీనిపై అమాయక ఆదివాసులను కొంతమంది ఆదివాసి నాయకులు ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆదివాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా డబ్బులను ఇవ్వరాదని, మాయమాటలు చెప్పే వారిని నమ్మవద్దని హితవు పలికారు. మోసం చేస్తున్న వారి వివరాలను సేకరించి వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కోర్టు నందు వ్యవహారం తేలే వరకు ఆదివాసులు సమయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అర్హులైన ఆదివాసిలకు ప్రభుత్వ ప్రతిఫలం ఎప్పటికైనా లభిస్తుందని, ఇటువంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆదివాసీలకు, ప్రజలకు సూచించారు.

ఇవి కూడా చదవండి